Saturday, May 30, 2015

My Art Book

Hare Krishna!!
Beatiful krishnas flute music that creating the rainbow of universe..


Durga

Thursday, January 26, 2012

|| బలమే జీవితం, బలహీనతే మరణం.
తోటి మనిషిని దేవుడులా పూజించు||

Friday, November 11, 2011

Friday, August 26, 2011

Sri Subrahmanya Ashtottara Satanama Stotram

http://teluguone.com/tonecmsuserfiles/subrahmanya-swami4(1).png|| శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటద్వజమ్ ||

|| ఓం స్కంధో గుహ శ్శణ్ముఖశ్చ ఫాలనేత్ర సుతః ప్రభు:పింగళ: కృత్తికాసూను: శ్శిఖివాహో ద్విజడ్చుజ: ||

|| ద్విషణ్ణేత్ర శక్తిధరః పిశితాష ప్రభంజనః తారకాసుర సంహారీ రక్షోబల విమర్దన ||

|| మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్య సురక్షకః దేవసేనాపతి: ప్రాజ్ఞః కృపాళు ర్భక్తవత్సలః ||

|| ఉమాసుత శక్తిధర: కుమారః క్రౌంచధారణ సేనానీ రగ్నిజాన్మా చ విశాఖ: శ్శంకరాత్మజః||

|| శివస్వామీ గానస్వామీ సర్వస్వామీ సనాతనః అనంతశక్తి రక్షోభ్యః పార్వతీ ప్రియనందనః ||

|| గంగాసుతః శరోద్భూత్త: పావకాత్మజ ఆత్మభువః జ్రుంభ: ప్రజ్జ్రుంభః కమలాసన సంస్తుతః ||

|| ఏకవర్ణో ద్విర్ణ శ్చత్రివర్ణ తధైవచ చతుర్వర్ణ: పంచవర్ణ పరంజ్యోతి: ప్రజాపతి ||

|| అగ్నిగర్భః శమీగర్భో విశ్వరేతాః సురారి: హిరణ్యవర్ణః సుభకృరిత్ వశుమాన్ వటువేషభ్రుత్ ||

|| పూషా గభస్తిర్గహనః చంద్రవర్ణః కళాధరః మాయాధరో మహామాయీ కైవల్యః సకలాత్మకః ||

|| విశ్వయోనీ రమేయాత్మా తేజోనిధిరనామయః పరమేష్టీ పరబ్రహ్మా వేదగర్బో విరాట్వపు: ||

|| పుళిందకన్యా భర్తాచ మహాసారస్వతప్రదః అశ్రితాఖిల దాతా ఛ చొరఘ్నే రోగనాశనః ||

|| అనంతమూర్తి రానందః శిఖండీకృత కేతనః డంభః పరమ డంభశ్చ మహాడంబో వృషాకపి||

|| కరనోపాత్త దేహశ్చ కారణాతీత విగ్రహః ఆహిరూపోట మృతవపు: ప్రాణాయామ పరాయణః ||

|| విరుద్దహంతా వీరఘ్నో రక్తాస్యామ: సుడింగళః సుబ్రహ్మణ్యో గుహః ప్రీతో బ్రహ్మణ్యో బ్రహ్మణ్యో బ్రహ్మణ ప్రియః ||

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం

Sri Anjaneya Dandakam

శ్రీ ఆంజనేయం – ప్రసన్నాంజనేయం – ప్రభాదివ్యకాయం – ప్రకీర్తిప్రదాయం – భజేవాయుపుత్రం – భజేవాలగాత్రం – భజేహం పవిత్రం – భజేసూర్యమిత్రం – భజేరుద్రరూపం – భజే బ్రహ్మతేజంబటంచున్ – ప్రభాతంబు సాయంత్రంబు – నీనామ సంకీర్తనల్ జేసి – నీరూపు వర్ణించి – నీమీద నేదండకం బొక్కటిన్ – జేయనూహించి – నీమూర్తినిన్ గాంచి – నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై – శ్రీరామ భక్తుండనై – నిన్ను నేగొల్చెదన్ – నీకటాక్షంబునన్ జూచితే – వేడుకల్ జేసితే – నా మొరాలించితే – నన్ను రక్షించితే- దగ్గరన్నిల్చితే – తొల్లి సుగ్రీవుకు న్మంత్రివై స్వామికార్యార్ధమం దుండి – శ్రీరామసౌమిత్రులంజూచి – వారిన్ విచారించి – సర్వేశు పూజించి – యబ్బానుజుల బంటుగావించి – యవ్వాలినింజంపి – కాకుత్థ్సతిలకున్ – దయాదృష్టి వీక్షించి – కిష్కింధకేతెంచి – శ్రీరాముకార్యార్ధమై – లంకకేతెంచియున్ – లంకిణింజంపియున్ – లంకయున్గాల్చియున్ – భూమిజన్ జూచి – యానందముప్పొంగ – నా యుంగరంబిచ్చి – యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి – సంతోషితున్ జేసి – సుగ్రీవుడా యంగదా జాంబవంతాది – వీరాదులం గూడి – యాసేతువున్ దాటి – వానరుల్ మూక పెన్మూకలై – దైత్యులన్ ద్రుంచగా – రావణుండంత – కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి – యాశక్తియున్ వేసి – యాలక్ష్మణున్ మూర్చనొందించగా – నప్పుడేబోయి సంజీవియున్ దెచ్చి – సౌమిత్రికిన్నిచ్చి – ప్రాణంబురక్షించగా – కుంభకర్ణాది న్వీరులన్ బోరి – శ్రీరాము బాణాగ్ని వారందరున్ – రావణున్ జంపగా- నంతలోకంబులానందమైయుండ – నవ్వేళలందు – న్విభీషణన్ – వేడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జేయించి సీతామహాదేవినిన్ దెచ్చి – శ్రీరాముతో జేర్చి – యయోధ్యక్షున్ వచ్చి – పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న – నాకేవ్వరున్ కూర్మిలేరంచు – మన్నించినన్ – శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను – నీనామ సంకీర్తనల్ జేసితే – పాపముల్ బాయునే – భయములు నీర్దునే – భాగ్యముల్ గల్గునే – సకల సామ్రాజ్యముల్ – సకల సంపత్కారమ్ముల్ధగం గల్గవే వానరాకార – యోభక్తమందార – యోపుణ్యసంచార – యోధీర – యోవీర – నీవేసమస్తంబు – నీవేమహాఫలముగా వెలసి – యా తారకబ్రహ్మమంత్రంబు – పఠియించుచున్ సంధానమున్ జేయుచున్ స్థిరముగా వజ్రదేహంబునుందాల్చి – శ్రీరామ శ్రీరామ యంచున్ – మనఃపూతమై – ఎప్పుడున్ తప్పకన్ దలతు – నాజిహ్వాయందుండియుం నీదీర్ఘదేహంబు – త్రైలోకసంచారివై – రామనామాంకితధ్యానివై – బ్రహ్మవై – బ్రహ్మతేజంబునన్ – రౌద్రనిజ్వాల కల్లోల – హావీర హనుమంత – ఓంకార ఓంకార శబ్దంబులన్ – క్రూరసర్వగ్రహ భూతప్రేతపిశాచ – శాకినీడాకీనీ – మోహినీ గాలిదయ్యంబులన్ నీదువాలంబునన్ జుట్టి - నేలం బడంగొట్టి – నీ ముష్టిఘాతంబులన్ – బహుదండంబులన్ – రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై – బ్రహ్మప్రభాభాపితంబైవ – నీదివ్య తేజంబునన్ జూపి రార నాముద్దు కుమారా యంచు దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే, సదా బ్రహ్మచారీ నమస్తే, వ్రతపూర్ణహారీ నమస్తే వాయుపుత్రా నమస్తే నమోనమః