Saturday, May 30, 2015

My Art Book

Hare Krishna!!
Beatiful krishnas flute music that creating the rainbow of universe..


Durga

Thursday, January 26, 2012

|| బలమే జీవితం, బలహీనతే మరణం.
తోటి మనిషిని దేవుడులా పూజించు||

Friday, November 11, 2011

Friday, August 26, 2011

Sri Subrahmanya Ashtottara Satanama Stotram

http://teluguone.com/tonecmsuserfiles/subrahmanya-swami4(1).png|| శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటద్వజమ్ ||

|| ఓం స్కంధో గుహ శ్శణ్ముఖశ్చ ఫాలనేత్ర సుతః ప్రభు:పింగళ: కృత్తికాసూను: శ్శిఖివాహో ద్విజడ్చుజ: ||

|| ద్విషణ్ణేత్ర శక్తిధరః పిశితాష ప్రభంజనః తారకాసుర సంహారీ రక్షోబల విమర్దన ||

|| మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్య సురక్షకః దేవసేనాపతి: ప్రాజ్ఞః కృపాళు ర్భక్తవత్సలః ||

|| ఉమాసుత శక్తిధర: కుమారః క్రౌంచధారణ సేనానీ రగ్నిజాన్మా చ విశాఖ: శ్శంకరాత్మజః||

|| శివస్వామీ గానస్వామీ సర్వస్వామీ సనాతనః అనంతశక్తి రక్షోభ్యః పార్వతీ ప్రియనందనః ||

|| గంగాసుతః శరోద్భూత్త: పావకాత్మజ ఆత్మభువః జ్రుంభ: ప్రజ్జ్రుంభః కమలాసన సంస్తుతః ||

|| ఏకవర్ణో ద్విర్ణ శ్చత్రివర్ణ తధైవచ చతుర్వర్ణ: పంచవర్ణ పరంజ్యోతి: ప్రజాపతి ||

|| అగ్నిగర్భః శమీగర్భో విశ్వరేతాః సురారి: హిరణ్యవర్ణః సుభకృరిత్ వశుమాన్ వటువేషభ్రుత్ ||

|| పూషా గభస్తిర్గహనః చంద్రవర్ణః కళాధరః మాయాధరో మహామాయీ కైవల్యః సకలాత్మకః ||

|| విశ్వయోనీ రమేయాత్మా తేజోనిధిరనామయః పరమేష్టీ పరబ్రహ్మా వేదగర్బో విరాట్వపు: ||

|| పుళిందకన్యా భర్తాచ మహాసారస్వతప్రదః అశ్రితాఖిల దాతా ఛ చొరఘ్నే రోగనాశనః ||

|| అనంతమూర్తి రానందః శిఖండీకృత కేతనః డంభః పరమ డంభశ్చ మహాడంబో వృషాకపి||

|| కరనోపాత్త దేహశ్చ కారణాతీత విగ్రహః ఆహిరూపోట మృతవపు: ప్రాణాయామ పరాయణః ||

|| విరుద్దహంతా వీరఘ్నో రక్తాస్యామ: సుడింగళః సుబ్రహ్మణ్యో గుహః ప్రీతో బ్రహ్మణ్యో బ్రహ్మణ్యో బ్రహ్మణ ప్రియః ||

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం

Sri Anjaneya Dandakam

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజేసూర్యమిత్రం భజేరుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు నీనామ సంకీర్తనల్ జేసి నీరూపు వర్ణించి నీమీద నేదండకం బొక్కటిన్ జేయనూహించి నీమూర్తినిన్ గాంచి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై శ్రీరామ భక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీకటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే- దగ్గరన్నిల్చితే తొల్లి సుగ్రీవుకు న్మంత్రివై స్వామికార్యార్ధమం దుండి శ్రీరామసౌమిత్రులంజూచి వారిన్ విచారించి సర్వేశు పూజించి యబ్బానుజుల బంటుగావించి యవ్వాలినింజంపి కాకుత్థ్సతిలకున్ దయాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరాముకార్యార్ధమై లంకకేతెంచియున్ లంకిణింజంపియున్ లంకయున్గాల్చియున్ భూమిజన్ జూచి యానందముప్పొంగ నా యుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషితున్ జేసి సుగ్రీవుడా యంగదా జాంబవంతాది వీరాదులం గూడి యాసేతువున్ దాటివానరుల్ మూక పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తియున్ వేసి యాలక్ష్మణున్ మూర్చనొందించగా నప్పుడేబోయి సంజీవియున్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబురక్షించగా కుంభకర్ణాది న్వీరులన్ బోరి శ్రీరాము బాణాగ్ని వారందరున్ రావణున్ జంపగా- నంతలోకంబులానందమైయుండ నవ్వేళలందు న్విభీషణన్ వేడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జేయించి సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముతో జేర్చి యయోధ్యక్షున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకేవ్వరున్ కూర్మిలేరంచు మన్నించినన్ శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనల్ జేసితే పాపముల్ బాయునే భయములు నీర్దునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్కారమ్ముల్ధగం గల్గవే వానరాకార యోభక్తమందార యోపుణ్యసంచార యోధీర యోవీర నీవేసమస్తంబు నీవేమహాఫలముగా వెలసి యా తారకబ్రహ్మమంత్రంబు పఠియించుచున్ సంధానమున్ జేయుచున్ స్థిరముగా వజ్రదేహంబునుందాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై ఎప్పుడున్ తప్పకన్ దలతు నాజిహ్వాయందుండియుం నీదీర్ఘదేహంబు త్రైలోకసంచారివై రామనామాంకితధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్రనిజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార ఓంకార శబ్దంబులన్ క్రూరసర్వగ్రహ భూతప్రేతపిశాచ శాకినీడాకీనీ మోహినీ గాలిదయ్యంబులన్ నీదువాలంబునన్ జుట్టి - నేలం బడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్బహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై బ్రహ్మప్రభాభాపితంబైవనీదివ్య తేజంబునన్ జూపి రార నాముద్దు కుమారా యంచు దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే, సదా బ్రహ్మచారీ నమస్తే, వ్రతపూర్ణహారీ నమస్తే వాయుపుత్రా నమస్తే నమోనమః