Friday, August 26, 2011

Sri Anjaneya Dandakam

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజేసూర్యమిత్రం భజేరుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు నీనామ సంకీర్తనల్ జేసి నీరూపు వర్ణించి నీమీద నేదండకం బొక్కటిన్ జేయనూహించి నీమూర్తినిన్ గాంచి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై శ్రీరామ భక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీకటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే- దగ్గరన్నిల్చితే తొల్లి సుగ్రీవుకు న్మంత్రివై స్వామికార్యార్ధమం దుండి శ్రీరామసౌమిత్రులంజూచి వారిన్ విచారించి సర్వేశు పూజించి యబ్బానుజుల బంటుగావించి యవ్వాలినింజంపి కాకుత్థ్సతిలకున్ దయాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరాముకార్యార్ధమై లంకకేతెంచియున్ లంకిణింజంపియున్ లంకయున్గాల్చియున్ భూమిజన్ జూచి యానందముప్పొంగ నా యుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషితున్ జేసి సుగ్రీవుడా యంగదా జాంబవంతాది వీరాదులం గూడి యాసేతువున్ దాటివానరుల్ మూక పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తియున్ వేసి యాలక్ష్మణున్ మూర్చనొందించగా నప్పుడేబోయి సంజీవియున్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబురక్షించగా కుంభకర్ణాది న్వీరులన్ బోరి శ్రీరాము బాణాగ్ని వారందరున్ రావణున్ జంపగా- నంతలోకంబులానందమైయుండ నవ్వేళలందు న్విభీషణన్ వేడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జేయించి సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముతో జేర్చి యయోధ్యక్షున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకేవ్వరున్ కూర్మిలేరంచు మన్నించినన్ శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనల్ జేసితే పాపముల్ బాయునే భయములు నీర్దునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్కారమ్ముల్ధగం గల్గవే వానరాకార యోభక్తమందార యోపుణ్యసంచార యోధీర యోవీర నీవేసమస్తంబు నీవేమహాఫలముగా వెలసి యా తారకబ్రహ్మమంత్రంబు పఠియించుచున్ సంధానమున్ జేయుచున్ స్థిరముగా వజ్రదేహంబునుందాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై ఎప్పుడున్ తప్పకన్ దలతు నాజిహ్వాయందుండియుం నీదీర్ఘదేహంబు త్రైలోకసంచారివై రామనామాంకితధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్రనిజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార ఓంకార శబ్దంబులన్ క్రూరసర్వగ్రహ భూతప్రేతపిశాచ శాకినీడాకీనీ మోహినీ గాలిదయ్యంబులన్ నీదువాలంబునన్ జుట్టి - నేలం బడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్బహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై బ్రహ్మప్రభాభాపితంబైవనీదివ్య తేజంబునన్ జూపి రార నాముద్దు కుమారా యంచు దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే, సదా బ్రహ్మచారీ నమస్తే, వ్రతపూర్ణహారీ నమస్తే వాయుపుత్రా నమస్తే నమోనమః

No comments:

Post a Comment